December 28, 2021
దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తుండగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ అలాగే హీరోయిన్లుగా అలియా భట్, ఒలివా మోరిస్ కీలక పాత్రలో శ్రేయ సరన్ కనిపించబోతుంది. ఈ స్టార్ కాస్టింగ్ కారణంగా సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లే విధంగా రాజమౌళి ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు. ఇటీవల ముంబైలో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈవెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తమిళ ఇండస్ట్రీలో కూడా శివకార్తికేయన్ ప్రత్యేక అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.
ఇక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు. ఇక ఇటీవల దర్శకుడు రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టు మహేష్ బాబు తోనే ఉంటుంది అని ఆ సినిమా కూడా అంచనాలకు తగ్గట్టుగానే తెరపైకి రాబోతున్నారు క్లారిటీ అయితే ఇచ్చారు.
మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రాజెక్టు ఎప్పుడు వస్తుంది అనే విషయం పై అనేక రకాల ప్రశ్నలు ఎదురవ్వగా పక్కనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఎవరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చాడు. తప్పకుండా సినిమా 2026 లో వస్తుంది అంటూ సెటైర్ కూడా వేశాడు. ఆ తర్వాత మెల్లగా ఆలోచించి చర్చలతోనే వచ్చే ఏడాది మొత్తం పూర్తవుతుంది అని ఇక ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే 2025 లో మళ్లీ ముందుకు వస్తారు అని సెటైర్ వేశాడు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన తర్వాత పక్కనే వున్న రామ్ చరణ్ కూడా అది కూడా కరెక్ట్ అంటూ.. అది కూడా పాండమిక్ లేకపోతేనని ఎలాంటి సమస్యలు రాకపోతే ఆ సమయానికి రావచ్చు అని మరొక కౌంటర్ కూడా వేశాడు. ఇక వీరిద్దరిని చూసిన రాజమౌళి తనలో తనే నవ్వుకున్నాడు. ఇక మహేష్ సినిమా విషయంలో ఎన్ని రోజుల సమయాన్ని తీసుకుంటాడో చూడాలి.
READ MORE: బికినీలో సమంత..న్యూ ఇయర్ పార్టీ అక్కడేనా..?