February 22, 2024
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన దర్శకత్వంలో ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకు రానటువంటి గోల్డెన్ గ్లోబల్ ఆస్కార్ వంటి అవార్డులు కూడా రాజమౌళి సినిమాకు వచ్చాయి.
ఈ విధంగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. రాజమౌళి సినిమా అంటే అందరికీ కూడా అదే స్థాయిలోనే అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయాలని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఇక రాజమౌళి రవితేజ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రాలలో విక్రమార్కుడు ఒకటి.
ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించారు. ఈ సినిమా కూడా అప్పట్లో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించడం కోసం రవితేజకు రాజమౌళి కొన్ని కండిషన్లు పెట్టారని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో నటించాలి అంటే స్క్రిప్ట్ ఎలాగా ఉందో అలాంటి డైలాగ్ తప్పనిసరిగా చెప్పాలని రాజమౌళి కండిషన్ పెట్టారట.
అందులో ఉన్నటువంటి డైలాగ్స్ చెప్పాలని ఎలాంటి బీప్ వాడకుండా ఉండాలని రాజమౌళి చెప్పారు. అంతేకాకుండా నేను ఒక స్టార్ హీరోని నాకు ఇలాంటివన్నీ సెట్ అవ్వవు నేను చెప్పను అంటే కుదరదని ఇలాంటి కండిషన్లకు ఒప్పుకుంటేనే తనతో సినిమా చేస్తాను అంటూ రాజమౌళి రవితేజకు కండిషన్ లు పెట్టగా రవితేజ కూడా ఈ కండిషన్లకు ఒప్పుకొని సినిమా చేశారని తెలుస్తుంది. రవితేజ కూడా ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో విక్రమార్కుడు సినిమా అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
Read More: ఎన్టీఆర్ తలుచుకుంటే టిడిపి రాత్రికి రాత్రే ఫినిష్ అవుతుంది.. వర్మ కామెంట్స్ వైరల్!