అప్డేట్ ల వర్షంతో కమల్ హాసన్.. ఆ సినిమాలో అతిధి పాత్ర!

March 26, 2024

అప్డేట్ ల వర్షంతో కమల్ హాసన్.. ఆ సినిమాలో అతిధి పాత్ర!

వయసుతో సంబంధం లేకుండా ఫుల్ బిజీ షెడ్యూల్ తో వరసగా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేస్తున్నారు కమల్ హాసన్. తాజాగా ఒక ఆంగ్ల న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను నటిస్తున్న మూడు చిత్రాల గురించి అప్డేట్లు ఇచ్చారు. తన చేతిలో ప్రస్తుతం ఇండియన్2, థగ్ లైఫ్, కల్కి చిత్రాలు ఉన్నాయి. ఇండియన్ టూ, ఇండియన్ త్రీ షూటింగ్ ఆల్రెడీ అయిపోయిందని, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్కులు అవుతున్నాయని చెప్పారు.

అది అయిపోయిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు కూడా వెల్లడించారు కమల్ హాసన్. ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి విషయానికొస్తే అందులో ఒక అతిధి పాత్రలో కనిపించునున్న కమల్ హాసన్ పాత్రకి షూటింగ్ పూర్తి చేసుకున్నారట. ఈ సినిమా విడుదల డేట్ పోస్టపోన్ అయిందని వార్తలు వస్తున్నాయి.

కానీ దీని గురించి కమలహాసన్ ఎటువంటి వాక్యాలు వెల్లడించలేదు. ఈమధ్య దర్శకుడు లోకేష్ కనకరాజ్, శృతిహాసన్ జంటగా ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇనిమాల్ అంటూ సాగే ఈ పాటకి కమల్ హాసన్ లిరిక్స్ కూడా అందించారు. తాజాగా ఇళయరాజా బయోపిక్ ఆధారంగా ధనుష్ ఒక సినిమా తీయనున్నారు అని అఫీషియల్ గా పోస్టర్ని విడుదల చేశారు. అయితే ఈ చిత్రంలో కమల్ హాసన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇళయరాజా మీద కమల్ హాసన్ కి ఉన్న గౌరవం, అభిమానం వలనే ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నారని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత బిజీగా ఉన్న కమల్ హాసన్ సినిమాల రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంత వయసు వచ్చినా ఏమాత్రం జోరు తగ్గకుండా ఫుల్ స్పీడ్ లో ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కమల్ హాసన్. హ్యాట్సాఫ్ లోకనాయక.

Read More: మూడు గంటల పాటు బన్నీని ఎండలో నిలబెట్టిన సుకుమార్.. అదే కారణమా?

ట్రెండింగ్ వార్తలు