కల్కి నుంచి అదిరిపోయే అప్డేట్.. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్.. వీడియో వైరల్?

April 22, 2024

కల్కి నుంచి అదిరిపోయే అప్డేట్.. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్.. వీడియో వైరల్?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే మేలో ఈ సినిమా విడుదల కావ్వాల్సి ఉండగా ఎన్నికల సమయం కావడంతో కల్కి మూవీ మరోసారి వాయిదా పడింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా అప్డేట్స్ కోసం మా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని రివీల్ చేసారు. ఐపీఎల్ మూడ్ లో అందరూ ఉండగా దానికి ఇంకొంచెం హ్యాపినెస్ ఇస్తూ స్టార్ స్పోర్ట్స్ లో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా కనపడబోతున్నట్టు, ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలిపారు.

దీంతో మరోసారి కల్కి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా 6000 సంవత్సరాల కథతో జరుగుతుందని, ఈ సినిమాలో పురాణాల ప్రకారం చెప్పిన ఏడుగురు చిరంజీవులు ఉంటారని వార్తలు వచ్చాయి. అమితాబ్ ని అశ్వత్థామ క్యారెక్టర్ గా చూపించడంతో అంతా ఈ వార్తలు నిజమే అవుతాయని భావిస్తున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన లుక్ వీడియోని షేర్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త మరింత పెరిగాయి.

Read More: డబ్బు ల్లేకపోవడంతో శివాజీకి రెంట్ కట్టిన చిరంజీవి.. ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు