రామ్‌చ‌ర‌ణ్ కోసం ఎన్టీఆర్‌ను ప‌క్క‌న‌పెట్టిన కియ‌రా!

August 2, 2021

రామ్‌చ‌ర‌ణ్ కోసం ఎన్టీఆర్‌ను ప‌క్క‌న‌పెట్టిన కియ‌రా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వాణీ తెలుగులో మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను, రామ్‌చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ సినిమాల్లో మెరిసిన సంగ‌తి తెలిసిందే..అయితే విన‌య విధేయ రామ డిజాస్ట‌ర్ కావ‌డంతో రెండేళ్ల పాటు ఇటువైపు చూడ‌లేదు. అయితే ఇంతలోనే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతోన్న #NTR30 కోసం కథానాయికగా కియరాను ఎంపిక చేసుకున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ క‌రోనా వ‌ల్ల డిలే అయ్యింది. తాజా సమాచారం మేరకు రామ్ చరణ్ సరసన కియారా మ‌రోసారి న‌టించ‌నుంది. అంతే కాదు ఆ సినిమా కోసం #NTR30ని కూడా ప్ర‌క్క‌కు పెట్టింద‌ట ఈ అమ్మ‌డు. దీనికి కార‌ణం శంకర్ జాతీయ స్థాయిలో ఐడెంటిటీ ఉన్న దర్శకుడు కావడం అలాగే చరణ్ కి మగధీర- తుఫాన్ వంటి చిత్రాలతో బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపురావ‌డం అని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు