RC15: చరణ్‌ సినిమా తిరిగి ప్రారంభం ఈ రోజే..శంకర్‌ ప్లాన్స్‌ మాములుగా లేవుగా..!

September 5, 2022

RC15: చరణ్‌ సినిమా తిరిగి ప్రారంభం ఈ రోజే..శంకర్‌ ప్లాన్స్‌ మాములుగా లేవుగా..!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా చేస్తున్న సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల శంకర్‌ ‘ఇండియన్‌ 2’ సినిమాకు షిఫ్ట్‌ కావడంతో , రామ్‌చరణ్‌తో శంకర్‌ చేస్తున్న సినిమా ఆగిపోయిందా? అనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపించింది. అయితే ఈ సినిమా ఆగిపోలేదని, కమల్‌హాసన్‌తో ఇండియన్‌ 2, రామ్‌చరణ్‌తో చేస్తున్న సినిమా రెండు సమాంతరంగా చిత్రీకరణలు జరుపుకుంటాయని శంకర్‌ తెలిపారు. ప్రస్తుతం ఆగస్టు 24న తిరిగి మొదలైన ‘ఇండియన్‌ 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారుశంకర్‌. అయితే రామ్‌చరణ్‌తో సినిమా షూటింగ్‌ ఈ నెల 8 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత వైజాగ్‌లో చిత్రీకరిస్తారు. ఈ లోపు ఇండియన్‌ 2 మేకోవర్‌ కోసం కమల్‌హాసన్‌ విదేశాలకు వెళ్లి వస్తారు. కమల్‌ రాగానే రామ్‌చరణ్‌ సినిమాను హోల్డ్‌లో పెట్టి శంకర్‌ ఇండియన్‌ 2తో బిజీ అవుతారు.

ఇక రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ఇప్పటికే ‘అధికారి’, ‘విశ్వంభర’ అనే టైటిల్స్‌ తెరపైకి వచ్చాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘వినయవిధేయరామ’ చిత్రం తర్వాత కియారా, చరణ్‌ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. ఐఏఎస్‌ ఆఫీసర్ల జీవనశైలి, వారి వృత్తి జీవితం, రాజకీయ ఒత్తిళ్ళు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ తండ్రీకొడుల పాత్రల్లో కనిపిస్తారు. ఇటు చరణ్‌ క్యారెక్టర్‌లో కూడా షేడ్స్‌ ఉంటాయి. స్టూడెంట్‌ లీడర్‌గా, ఐఏఎస్‌ ఆఫీసర్‌గా, రాజకీయనాయకుడిగా కనిపిస్తారట. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, నవీన్‌చంద్ర, సునీల్, జయరాం తదితరులు కీ రోల్స్‌ చేస్తున్నారు. దిల్‌ రాజు, శీరిష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.

మరోవైపు రామ్‌చరణ్‌ నెక్ట్స్‌ సినిమాపై ఓ సందిగ్దత నెలకొని ఉంది. నిజానికి రామ్‌చరణ్‌ నెక్ట్స్‌ ఫిల్మ్‌కు ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఈ సినిమా ప్రస్తుతం హోల్డ్‌లో పడింది. దీంతో రామ్‌చరణ్‌ నెక్ట్స్‌ సినిమాకు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తారని, లేదు తమిళ దర్శకుడు మోహన్‌రాజా ‘ధృవ 2’ చేస్తారని..ఇలా విభిన్నరకాలైన ప్రచారాలు వినిపిస్తాయి. చరణ్‌ ఓ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ చేస్తారన్న ఊహాగానాలు లేకపోలేదు. అయితే ఈ అంశాలపై ఓ అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు