August 29, 2022
కృష్ణవంశీ సినిమా వెండితెరపైకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతోంది. 2017లో సందీప్‌కిషన్ హీరోగా, సాయి ధరమ్‌తేజ్ కీలక పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నక్షత్రం’. ఈ సినిమాయే కృష్ణవంశీ లాస్ట్ మూవీ. ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ ‘రంగ మార్తాండ’ అనే సినిమా చేశారు. మరాఠి ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్ ఇది.ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేయాలనుకున్నారు. జూలై నెల చివర్లో ప్రమోషన్స్‌ను బాగానే చేశారు. కానీ ఆగస్టు రెండోవారంలో మాత్రం ‘రంగమార్తండ’ థియేటర్స్‌కు రాలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి రీ షూట్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఇది కూడా పూర్తి కావొచ్చింది. మరో రెండు రోజులు షూటింగ్ జరుపుకుంటే ‘రంగమార్తాండ’ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. అప్పుడు రిలీజ్‌పై కూడా ఓ స్పష్టత వస్తుంది.
‘రంగమార్తాండ’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తూనే కృష్ణవంశీ ఇతర ప్రాజెక్ట్స్‌పై కూడా దృష్టి పెట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నేపథ్యంలో ఓ వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేశారు కృష్ణవంశీ. గతంలో ఫుడ్ అండ్ మెడికల్ మాఫియా నేపథ్యంలో ‘అన్నం’ అనే సినిమాను ప్రకటించారు. వీటికి తోడు పూజాహెగ్డే, రకుల్‌ప్రీత్‌సింగ్ కాంబినేషన్లో ఓ సినిమాను కృష్ణవంశీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. రంగమార్తాండ రిలీజ్ కాకుండానే కృష్ణవంశీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను గురించి ఈ స్థాయిలో వార్తలు రావడం కాస్త కొత్త విషయమనే చెప్పాలి మరి.