వీకెండ్‌ను కూడా క్యాష్ చేసుకోలేక‌పోయిన లైగ‌ర్.. ఆదివారం వ‌ర‌కు ఎంత వ‌చ్చిందో చూడండి

August 29, 2022

వీకెండ్‌ను కూడా క్యాష్ చేసుకోలేక‌పోయిన లైగ‌ర్.. ఆదివారం వ‌ర‌కు ఎంత వ‌చ్చిందో చూడండి

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్`కి మొద‌టి ఆట నుండే క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ రావడంతో మ్యాట్నీ షోల నుండే ఈ చిత్రం కలెక్షన్లు తగ్గిపోయాయి. ఒక్క హిందీలో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ మూవీ డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. హిందీలో అయితే ఈ మూవీ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు సూపర్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. కానీ రెండో రోజును మించి మూడో రోజు, మూడో రోజును మించి 4 వ రోజు కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్(4 డేస్ కలెక్షన్స్) ని గమనిస్తే :

నైజాం: 5.54 కోట్లు సీడెడ్: 1.80 కోట్లు ఉత్తరాంధ్ర: 1.72 కోట్లు ఈస్ట్: 0.86 కోట్లు వెస్ట్: 0.56 కోట్లు గుంటూరు: 0.96 కోట్లు కృష్ణా: 0.70 కోట్లు నెల్లూరు: 0.51 కోట్లు

ఏపీ+తెలంగాణ టోటల్ : 12.65 కోట్లు(షేర్)

కర్ణాటక : 0.88 కోట్లు కేరళ : 0.23 కోట్లు తమిళనాడు : 0.28 కోట్లు హిందీ : 6.25 కోట్లు ఓవర్సీస్ : 3.30 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ : 23.59 కోట్లు(షేర్)

‘లైగర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.82.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ (4 రోజులు) పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.23.59 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.61.41 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి. కాని ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ని బ‌ట్టి చేస్తే ఈ సినిమా దాదాపు 50 కోట్ల‌కు పైగానే న‌ష్టాలు మిగిలే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. అదే జ‌రిగితే అటు పూరిజ‌గ‌న్నాధ్, ఇటు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇద్ద‌రి కెరీర్లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల‌వ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు