January 28, 2024
సూపర్ మహేశ్ బాబు గత కొంత కాలంగా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు..కానీ తన ఎంబి ఎంటర్టైన్ మెంట్స్‌కి నిర్మాణ భాగస్వామిగా చేర్చి బిజినెస్‌లో వాటా తీసుకుంటున్నాడు. మహర్షి
సినిమా నుండే ఇది మొదలైంది. దాని వల్ల నిర్మాతకు మొదట నిర్మాణ భారం తగ్గుతుంది. ఆ డబ్బుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయగలుగుతాడు. ఇప్పుడు రాజమౌళితో రాజమౌళితో చేయబోయే సినిమాలో కూడా తన ఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను నిర్మాణ భాగస్వామిగా చేర్చాలని చూస్తున్నాడంట మహేష్.
మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ఆర్ఆర్ఆర్
మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే రాజమౌళి, ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించాడు. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజులో ఇది ఉండదని ప్రచారం జరుగుతోంది. తాజాగా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయినట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది ఉగాదికి సినిమాని లాంఛనంగా ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. రెండేళ్లలో సినిమా రిలీజ్ చేయాలనేది ప్లాన్.
అడ్వంచర్ బ్యాక్‌డ్రాప్లో రూపొందే ఈ సినిమాని దాదాపు రూ.1000 కోట్ల బడ్డెట్‌తో నిర్మించనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.. రీసెంట్‌గా ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల్ని పలకరించిన మహేశ్ కు గట్టి షాకిచ్చారు త్రివిక్రమ్..అత్తారింటికి దారేది కథను అటు ఇటు మార్చి గుంటూరు కారంగా తీశాడు అనే టాక్ వినిపిస్తోంది. సినిమాకు మొదటినుండి జరిగిన నెగటివ్ ప్రచారం కూడా కలెక్షన్లు తగ్గడానికి ప్రధానకారణమైంది.
Read More: ఓటీటీలో దుమ్ములేపుతున్న సలార్…