మహేష్ రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరో?

January 31, 2024

మహేష్ రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి వారిలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా దర్శకుడిగా అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు.

ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి RRR సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా అనంతరం రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయబోతున్నారు. ఈ సినిమా ఆఫ్రికా అడవులలో కొనసాగుతుందని ఇదొక అడ్వెంచర్స్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు.

ఈ సినిమా కోసం గత పది రోజుల నుంచి మహేష్ బాబు జర్మనీలోనే ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలబడలేదు కానీ తాజాగా మరొక వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మహేష్ బాబు మాత్రమే కాకుండా మరో టాలీవుడ్ హీరో కూడా నటిస్తున్నారని సమాచారం.

రాజమౌళి సినిమా అంటేనే కేవలం టాలీవుడ్ హీరోలు మాత్రమే కాకుండా ఇతర భాష హీరోలు కూడా సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈయన ఇతర భాష హీరోలను కాకుండా టాలీవుడ్ హీరోల వైపే మొగ్గు చూపుతున్నారట. ఆ హీరో నెగిటివ్ పాత్రలో కాకుండా ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నారని తెలుస్తోంది. మరి రాజమౌళి సినిమాలో భాగం కాబోతున్నటువంటి ఆ హీరో ఎవరు ఈ సినిమా కథ ఏంటి అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

Read More: సంక్రాంతికి వచ్చి చరిత్ర తిరగరాసిన హనుమాన్ చిత్రం!

ట్రెండింగ్ వార్తలు