ఫ్యామిలీతో కలిసి యూరప్ లో చిల్ అవుతున్న మహేష్ బాబు.. నెట్టింట ఫోటోస్ వైరల్?

April 12, 2024

ఫ్యామిలీతో కలిసి యూరప్ లో చిల్ అవుతున్న మహేష్ బాబు.. నెట్టింట ఫోటోస్ వైరల్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన ఫ్యామిలీకి తగినంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీతో కలిసి ఏడాదిలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు అయినా వెకేషన్ కు వెళ్లి సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇప్పటికే అనేకసార్లు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సరదాగా గడిపారు. ఇక ఇటీవల 15 రోజుల క్రితం భార్య, పిల్లలతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లారు మహేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ ఫ్యామిలీ యూరప్ అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

అంతేకాకుండా ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మహేష్. అలాగే నమ్రత , సితార కూడా రెగ్యులర్ గా తమ యూరప్ ట్రిప్ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తున్నారు. తాజాగా యూరప్ ట్రిప్ లో కూతురు సితారతో కలిసి మహేష్ దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇందులో మహేష్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. తన కూతురు సితారతో కలిసిన ఒక క్యూట్ ఫోటో ఇప్పుడు ఆకట్టుకుంటోంది. అందులో తన కూతురుని ప్రేమగా హత్తుకొని కనిపిస్తున్నాడు. అలాగే ఈ ఫోటోలో మహేష్ లుక్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.

పొడవాటి జుట్టుతో సరికొత్త లుక్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు మహేష్. దాంతో ఆ ఫోటోని చూసిన అభిమానులు ముందుగా ఆ ఫోటోని చూసి అక్కడ మహేష్ బాబు కాదు గౌతమ్ ఉన్నాడని అనుకున్నాము. కానీ నిదానంగా ఫోటో చూస్తే అప్పుడు మహేష్ బాబు అని అర్థం అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం గౌతమ్ లాగే కనిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. బెస్ట్ ఫాదర్, డాటర్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ పొడవాటి జుట్టుతో ఉన్న ఫోటోలు చూసి ఈ సరికొత్త లుక్ రాజమౌళి సినిమా కోసమే అయ్యి ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు .

https://telugu.chitraseema.org/ram-charan-to-be-awarded-honorary-doctorate/

ట్రెండింగ్ వార్తలు