మ‌హేశ్-రాజ‌మౌళి సినిమాపై బిగ్ అప్డేట్‌..ఫ్యాన్స్‌కి పండ‌గే..

January 23, 2024

మ‌హేశ్-రాజ‌మౌళి సినిమాపై బిగ్ అప్డేట్‌..ఫ్యాన్స్‌కి పండ‌గే..

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం గుంటూరు కారం స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే మ‌రో వైపు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న ఆఫ్రికన్‌ ఫారెస్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసినట్లుగా ఇప్పటికే విజయేంద్రప్రసాద్‌ వెల్లడించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను రాజమౌళి పూర్తి చేశారనితెలిసింది. ఈ సినిమాలో హాలీవుడ్‌ యాక్టర్స్‌ భాగస్వామ్యులైయ్యేలా అమెరికాలోని ఓ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్‌కోసం జర్మనీలో మహేశ్‌బాబు స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. ఇలా ప్రీ ప్రొడక్షన్‌ పనులన్నీ శరవేగం గా జరిగిపోతున్నాయి.

తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వివరాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఏడాది ఉగాదికి సినిమాను మొద‌లు పెట్టి 2026 ఉగాదికి విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్‌. కాని రాజ‌మౌళి సినిమా అంటే క‌నీసం నాలుగు సంవ‌త్స‌రాలు అయినా ప‌డుతుంద‌ని తెలిసిందే..మ‌రి మ‌హేశ్ సినిమాని మాత్రం వేగంగా పూర్తి చేసి విడుద‌ల చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట రాజ‌మౌళి అండ్ కో.. మ‌హేష్ కూడా రెండు సంవ‌త్స‌రాల‌కి మించి ఒక్క రోజు కూడా సినిమాపై వ‌ర్క్ చేయ‌న‌ని ఖ‌రా ఖండీగా చేప్పేశార‌ట‌. అందుకే విడుద‌ల తేధిని కూడా ప్ర‌క‌టించిన త‌ర్వాతే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది టీమ్‌…ఈ సినిమాలో మ‌హేశ్ కౌ బాయ్ త‌ర‌హా క్యారెక్ట‌ర్లో క‌నిపించ‌నున్నారు. ఈ లుక్ మ‌హేశ్ బాబు అన్ని సినిమాల లుక్ క‌న్నా బెట‌ర్‌గా ఉండ‌నుంద‌ని ఇన్‌సైడ్ టాక్‌.

ఇక ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌ మూవీ కావడంతో ఈ సినిమాలో ‘దిల్‌’రాజు భాగమైయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. గతంలో మహేశ్ నటించిన చాలా సినిమాలను నిర్మించడంతో పాటుగా, మహేశ్‌నటించిన మరికొన్నిసినిమాలకు ‘దిల్‌’ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Read More: జై హ‌నుమాన్ స్క్రిప్ట్ వ‌ర్క్ ప్రారంభించిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌..

ట్రెండింగ్ వార్తలు