ఒకే స్క్రీన్‌పై మ‌హేష్‌, టైగ‌ర్ ష్రాఫ్‌..

September 5, 2021

ఒకే స్క్రీన్‌పై మ‌హేష్‌, టైగ‌ర్ ష్రాఫ్‌..

సూపర్ స్టార్‌ కృష్ణగారి వారసుడిగా వెండితెరకు పరిచయం అయినా తన న‌ట‌న‌లోని కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు వెలికితీస్తూ కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు మ‌హేష్ బాబు. మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను మ‌హేష్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్క‌డ ఆయ‌న సినిమాలు వ‌సూలు చేస్తున్న క‌లెక్ష‌న్లే దానికి సాక్ష్యం. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు చేస్తున్న సర్కారు వారి పాట సినిమాపై అంఛ‌నాలు ఆకాశాన్నంటాయ‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవ‌ల విడుద‌లైన అల్ట్రా స్టైలిష్ ఫ‌స్ట్‌లుక్ ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేసింది. బ్యాంక్ నుండి తీసుకున్న వేల‌కోట్ల ఋణాన్ని ఎగ‌వేసి వేరే దేశానికి పారిపోయిన‌ ఓ బ‌డా బిజినెస్ మేన్ ఆట‌క‌ట్టించి మ‌ళ్లీ మ‌న‌దేశానికి ఎలా తిరిగి ర‌ప్పించాడు?… అలాగే త‌న తండ్రి మీద ప‌డ్డ అప‌వాదును ఎలా పోగొట్టాడు అనే క‌థాంశంతో ప్ర‌స్తుతం దేశానికి అవ‌స‌ర‌మ‌య్యే ఓ మంచి సోషల్ మెసేజ్ తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పెట్ల‌. ఈ మూవీలో బ్యాంక్ మేనేజ‌ర్ కొడుకుగా కనిపించ‌నున్నారు మ‌హేష్.

ఈ మూవీ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో మూవీ చేయ‌నున్నాడు. అత‌డు, ఖ‌లేజ త‌ర్వాత వీళ్లిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న మూడో చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై కూడా భారీ అంఛనాలు ఉన్నాయి. అయితే సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌లో న‌టిస్తున్నాడు మ‌హేష్‌. ఇప్ప‌టికే థ‌మ్స‌ప్ యాడ్, త‌మ‌న్నాతో చేసిన యాడ్‌తో అల‌రించిన మ‌హేష్ బాబు ఇప్పుడు పాన్ బహార్ ఇలాచీ కోసం బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌తో చేతులు క‌ల‌ప‌నున్నాడు. ఈ ప్రకటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ఇప్పటికే మహేష్ బాబు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ మహేష్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. టైగర్, మహేష్‌తో కలిసి ఒకే స్క్రీన్ పైన కనిపించనుండ‌డంతో ఫ్యాన్స్ ఆనందం అవ‌ధులు దాటింది.

ట్రెండింగ్ వార్తలు