January 2, 2022
MaheshBabuNewYearCelebrations: మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. వీరితోపాటు.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబం కూడా ఇటీవల క్రిస్మస్ సెలబ్రెషన్స్ దుబాయ్‌లో జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిన్న రాత్రి ఓ రెస్టారెంట్లో మహేష్ ఫ్యామిలీ న్యూఇయర్ సెలబ్రెషన్స్ జరుపుకున్నారు. తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోను మహేష్ సతీమణి నమ్రత తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. అలాగే బుర్జ్ ఖలీఫా పై తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ న్యూఇయర్ విషెస్ తెలిపాడు మహేష్. ప్రస్తుతం మహేష్ బాబు.. డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.
Maheshbabu New Year Celebrations