April 30, 2024
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే మహేష్ బాబు ఇటీవలె గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. ఇకపోతే మహేష్ త్వరలో రాజమౌళి దర్శకత్వంలో భారీ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఆల్రెడీ జుట్టు పెంచుతూ సరికొత్త లుక్ లోకి మారుతున్నాడు.
దాంతో ఇటీవల మహేష్ బాబు ఎక్కడ కనపడినా మహేష్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మహేష్ బాబు నమ్రత, సితారతో కలిసి హైదరాబాద్ లో ఒక పెళ్ళికి హాజరయ్యారు. ఈ పెళ్ళికి అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారు. శ్యామలా దేవి మహేష్ ని చూడగానే దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఫోటో తీసుకుంది. అలాగే నమ్రతని కౌగలించుకొని పలకరించింది. సితార తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించింది శ్యామలా దేవి.
మహేష్ ఫ్యామిలీతో కాసేపు ముచ్చటించింది ప్రభాస్ పెద్దమ్మ. దీంతో మహేష్ ఫ్యామిలీతో శ్యామలాదేవి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఈ వీడియోల్ని తెగ షేర్ చేస్తున్నారు.
Read More: ప్రచార కార్యక్రమాలకు యాంకర్ శ్యామల.. ఆ ఎమ్మెల్యేకు మద్దతుగా ప్రచారం!