ఆ సినిమా కోసం బ్లాక్ లో టికెట్స్ కొని సినిమా చూసిన మహేష్ బాబు.. ఆ మూవీ ఏదంటే!

April 18, 2024

ఆ సినిమా కోసం బ్లాక్ లో టికెట్స్ కొని సినిమా చూసిన మహేష్ బాబు.. ఆ మూవీ ఏదంటే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కాగా మహేష్ చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు.

మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టుపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఒక సినిమా కోసం బ్లాక్ లో టికెట్స్ చూశారట. ఏంటి నిజమా అని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే.. గతంలో మహేష్ బాబు ఒక టీవీ షోలో పాల్గొన్న మహేష్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడైనా ఆటో ఎక్కారా.? అన్న ప్రశ్నకు చిన్నప్పుడు ఎప్పుడూ ఆటోలోనే ట్రావెల్ చేసేవాడిని చెన్నైలో ఎక్కువగా ఆటోలోనే తిరిగే వాడిని అని తెలిపారు. అలాగే ఎప్పుడైనా లైన్ లో నిలుచొని టికెట్ కొనుక్కొని.?

అన్న ప్రశ్నకు మహేష్ బదులిస్తూ.. చిన్న తనంలో దేవి థియేటర్స్ లో సినిమాలు చూశాను అని అన్నారు. రంగీలా సినిమాకోసం లైన్ లో నిలుచొని టికెట్స్ దొరక్కపోతే బ్లాక్ లో కొనడం లాంటివి చేసేవాళ్లం. కమల్ హాసన్, రజినీకాంత్ సినిమాలకోసం బ్లాక్ లో టికెట్స్ కొనడం చేశా అని తెలిపారు మహేష్ బాబు.

Read More: హీరో ప్రియదర్శికి వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్.. మాటలు కాస్త జాగ్రత్త అంటూ!

ట్రెండింగ్ వార్తలు