Manchu Manoj: భూమా మౌనికతో రెండో పెళ్లి వార్తలపై మ‌నోజ్ ఏమ‌న్నాడంటే!

September 5, 2022

Manchu Manoj: భూమా మౌనికతో రెండో పెళ్లి వార్తలపై మ‌నోజ్ ఏమ‌న్నాడంటే!

2019లో విడాకుల త‌ర్వాత దాదాపు మూడేళ్లుగా సినిమాల‌కి, మీడియాకి దూరంగా ఉంటూ వ‌చ్చాడు మంచు మ‌నోజ్‌. అయితే స‌డెన్‌గా నిన్న మ‌నోజ్ హైద‌రాబాద్‌లోని ఓ వినాయ‌క మండ‌పాన్ని సంద‌ర్శించ‌నున్నాడు మీడియా క‌వ‌రేజ్ కావాలి అని ఆయ‌న పీఆర్‌టీమ్ నుండి ఓ సందేశం వ‌చ్చింది. దాంతో ఇన్ని రోజులు మీడియాకి దూరంగా ఉన్న మ‌నోజ్‌కి ఈ రోజు క‌వ‌రేజ్ ఎందుకు అవ‌స‌రం వ‌చ్చిందా అని అనుమానంతో వెళ్లి చూస్తే మనోజ్ ఒంట‌రిగా మండ‌పానికి రాలేదు..త‌ను రెండోపెళ్లి చేసు కోబోతున్నాడు అని వార్త‌ల్లో వినిపిస్తున్నప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో కలిసి వ‌చ్చాడు. అప్పుడు అర్ధం అయింది. అవి గాసిప్ వార్త‌లు కావు నిజ‌మేన‌ని..

మ‌రో మీడియా ప్ర‌తినిధి ఓ అడుగు ముందుకేసి మీరు మౌనిక రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి.. మీరేమంటారు అంటూ మీడియా ప్రశ్నించగా.. “అది పర్సనల్‌ మంచి సమయం వచ్చినప్పుడు చెప్తాను” అంటూ మంచు మనోజ్‌ స్పందించాడు. అయితే తాము పెళ్లి చేసుకోవడం లేదు అని మాత్రం ఖండించలేదు. దాంతో మ‌నోజ్‌- భూమా మౌనిక పెళ్లి దాదాపు ఖాయ‌మైంద‌ని తెలుస్తోంది. సరైన సమయం చూసుకుని చెప్తానంటూ చెప్పడం వైరల్‌ గా మారింది.

2015లో మంచు మనోజ్- ప్రణతీ రెడ్డిల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు వ్యక్తిగత కారణాలతో.. పరస్పర అంగీకారంతో 2019లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నుంచి మంచు మనోజ్‌ రెండో పెళ్లి అంటూ చాలాసార్లు వార్తలు చక్కర్లు కొట్టడం చూశాం. అయితే ఇప్పుడు భూమా మౌనికారెడ్డితో మంచు మనోజ్‌ గణేశ్‌ మండపాన్ని దర్శించుకోవడం అటు రాజకీయంగా, ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ హాట్‌ టాపిక్‌ గా మారింది. మ‌నోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు