September 6, 2022
రామ్‌చరణ్-ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ తర్వాత ప్యాన్ ఇండియా, మల్టీస్టారర్ సినిమాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ తరుణంలో రెండు వేర్వేరు ఇండస్ట్రీలకు సంబందించిన ప్రముఖహీరోలు కలిసి నటించడం తాజా ట్రెండ్..దీంతో అన్ని భాషల్లోని టాలెంటెడ్ యాక్టర్స్‌ను ఒక దగ్గరకి తెస్తున్నారు నేటితరం దర్శకులు. ఇది ఇలా ఉండగా గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన పరశురాం ఈ సినిమా తర్వాత మహేశ్‌ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సర్కారువారిపాట యావరేజ్ సినిమాగా నిలిచింది. మహేశ్‌ని అందంగా చూపించిన విధానానికి అభిమానులు ఖుషీ అయినా కథ,ఆర్ఆర్ఆర్ విషయంలో పెదవివిరిచారు. ఈ సినిమా తర్వాత పరశురాం నాగచైతన్యతో ఓ సినిమా తీయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే పరశురామ్ ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసమే ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు ఓ కీలక పాత్రలో తమిళ స్టార్ హీరో శింబును కూడా తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే పరశురాం చెప్పిన కథ నాగచైతన్యకు నచ్చడంతో పరశురామ్ పూర్తి స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే ఈ మల్టీ స్టారర్ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఇందులో ఎంతవరకూ నిజం ఉందో…