September 10, 2022
రెజీనా కాసాండ్ర (Regina Cassandra)ని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఆవిడ దగ్గర అవి మాత్రమే ఉన్నాయా? అటువంటి జోక్స్ వేస్తారా? ఇంకేం లేవా? అని క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి కారణం కొన్ని రోజుల క్రితం జరిగిన ‘శాకిని డాకిని’ విలేకరుల సమావేశంలో రెజీనా ఓ విలేఖరిపై ‘మీ దగ్గర ఇటువంటి ప్రశ్నలే ఉన్నాయా? ఇంకేం లేవా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి సదరు రిపోర్టర్ అడిగిన ప్రశ్న `మీరు సినిమాలో ఓసీడీ ఉన్న అమ్మాయిగా నటించారు కదా నిజజీవితంలో కూడా ఆ సమస్య ఉందా?` దీనికి సాధారణమైన సమాధానం చెప్పొచ్చు. కాని రెజీనా కావాలనే దానిపై ఘాటుగా స్పందించారు. అదే ప్రెస్మీట్లో ఎవరిదో ఫోన్ మోగితే… ‘మీరు ప్రెస్‌మీట్‌కు వచ్చినప్పుడు మీ ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోరా?’ అని కూడా క్వశ్చన్ చేశారు.. బానే ఉంది కాని ఆ సమావేశం అనుకున్న సమయానికన్నా రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు రెజీనా..దానికి ముందు ఆమె మీడియాకి క్షమాపణలు చెప్పాలి. ఆ విషయం అటుంచితే..
ఈ నెల 16న ‘శాకిని డాకిని` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రెజీనా, నివేదా థామస్. ఇటీవల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న రెజీనా… ఒక ఇంటర్వ్యూలో ఆమె అడల్ట్ జోక్ వేశారు. ”బాయ్స్ గురించి నాకు ఓ జోక్ తెలుసు. అయితే, నేను ఇక్కడ ఆ జోక్ వేయకూడదు. అబ్బాయిలు… మ్యాగీ… రెండూ రెండు నిమిషాల్లో అయిపోతాయి” అని రెజీనా అన్నారు. పక్కన ఉన్న నివేదా థామస్ ముఖం కిందకు పెట్టుకుని నవ్వు బయటకు కనపడ నివ్వకుండా మేనేజ్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరూ పబ్లిక్‌లో డబుల్ మీనింగ్ జోక్స్ వేయరు. రెజీనా కొంచెం డిఫరెంట్. గతంలో కూడా ఈ విధమైన కామెంట్లు చేశారు. డబుల్ మీనింగ్ జోక్స్ వేశారు. ఇప్పుడు మగాళ్లను మ్యాగీతో కంపేర్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. దాంతో రెజీనాను రిపోర్టర్‌పై ఆమె వాడిన పదాలతోనే ట్రోలింగ్ చేస్తున్నారు.