సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

March 22, 2024

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించినటువంటి చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పుల్వామా దాడి జరిగిన అనంతరం పాకిస్తాన్ పై ఇండియన్ దాడి చేసిన ఘటన ఆధారంగా తెరకెక్కినది. ఇందులో వరుణ్ కి జోడీగా మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమా మార్చి 1వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేకపోయింది ఈ క్రమంలోనే ఈ సినిమాని తిరిగి ఓటీటీలో విడుదల చేశారు. మార్చి ఒకటో తేదీ విడుదల కాగా 20 రోజులు వ్యవదిలోనే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వారు విడుదల చేశారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నటువంటి అమెజాన్ వారు తెలుగు తమిళ భాషలలో స్ట్రీమింగ్ చేశారు. త్వరలోనే మరికొన్ని దక్షిణాది భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది అయితే హిందీలో మాత్రం థియేటర్లలో సినిమా విడుదలైనటువంటి 8 వారాలకే విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమా అమెజాన్ లో ప్రసారమవుతుంది అంటూ ఏ విధమైనటువంటి ప్రకటన ఇవ్వకుండా సైలెంట్ గా ఓటీటీలో విడుదల చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక ఈ సినిమా థియేటర్లో మిస్ అయినటువంటి వారు ఇక్కడ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాలో రుహాని శర్మ నవదీప్ వంటి వారందరూ కూడా కీలక పాత్రలలో నటించారు.

Read More: ఆ రోజే అల్లు అర్జున్ మైనపు విగ్రహ ఆవిష్కరణ.. ఈ మ్యూజియంలో కాదంట!

ట్రెండింగ్ వార్తలు