గాలిలో విన్యాసాలు.. ఆసక్తి రేపుతున్న ఆపరేషన్ వాలంటైన్?

February 21, 2024

గాలిలో విన్యాసాలు.. ఆసక్తి రేపుతున్న ఆపరేషన్ వాలంటైన్?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మార్చి 1వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అలాగే ఈ సినిమాలో నటిస్తున్నటువంటి నటి మానుషీ చిల్లర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ సినిమాలో వరుణ్ రుద్ర ఓ పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ ఈ మూవీలో కనిపించాడు. అతని హైట్, పర్సనాలిటీ ఈ పాత్రకు అతికినట్లు సరిపోయాయి. పైనుంచి వచ్చే ఆర్డర్లను ఫాలో కాకుండా మొండిగా డేంజరస్ ఆపరేషన్లకు వెళ్లే పాత్ర అతనిది. నిజానికి ఆ సీన్ తోనే ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచి వరుణ్ ఒంటి నిండా గాయాలు కనిపిస్తాయి. రుహానీ శర్మకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా ఇందులో కనిపించింది. ఇద్దరూ కలిసి గాల్లో చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పాలి. ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను కూడా ఎంతో అద్భుతంగా చూపించారు. చివర్లో వరుణ్ నడిపే ఎయిర్ క్రాఫ్ట్ కు మంటలు అంటుకోవడం, దాని నుంచి అతడు బయటపడటానికి చేసే ప్రయత్నంతో ట్రైలర్ ముగుస్తుంది. ఇక ఇందులో దేశభక్తిని చాటుతో చెప్పే డైలాగ్స్ కూడా ఆసక్తికరంగా మారాయి ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు పెరుగుతున్నాయి.

Read More: యూపీఐ చేస్తే చాలు..మహేష్ వాయిస్ వినోచ్చు తెలుసా.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

ట్రెండింగ్ వార్తలు