Naa Saami Ranga Trailer Review: నా సామీ రంగా ట్రైలర్ రివ్యూ!

January 9, 2024

Naa Saami Ranga Trailer Review: నా సామీ రంగా ట్రైలర్ రివ్యూ!

అక్కినేని నాగార్జున హీరోగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు జనవరి 14వ తేదీ నాగార్జున నటించినటువంటి నా సామి రంగ సినిమా విడుదల కానుంది. నాగార్జున ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రలలో నటించినటువంటి ఈ సినిమాలో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వంటి వారు కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ట్రైలర్ ను అల్లరి నరేష్ వాయిస్ తో ప్రారంభించారు. కిష్టయ్యను కొట్టే మగాడు ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారా అంటూ అల్లరి నరేష్ అడగ్గా.. కొందరు రౌడీలు నాగార్జున మీదకు దూసుకు వస్తారు. లుంగీ కట్టుకుని, స్టైల్ గా బీడీ తాగుతూ నాగార్జున ఎంట్రీ ఇస్తూ చేసినటువంటి ఫైట్ అందరినీ ఆకట్టుకుంది.

Read Moreనా పేరు తప్పుగా వాడుకుంటే తాటతీస్తా… మీడియాకు దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్?

అరేయ్ అంజి ఎస్కో అంటూ నాగార్జున చెప్పగానే.. అల్లరి నరేష్ డప్పుల కొడుతుండగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఇలా ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఒకవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గాను మరోవైపు మాస్ యాక్షన్ మూవీ గాను ఉందని తెలుస్తుంది. ఈ ట్రైలర్ మొత్తం నాగార్జున చేసే ఫైటింగ్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ తో నాగార్జున కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా ఇందులో చూపించారు.

ఇక చివర్లో నాగార్జున ఇంకెందుకు ఆలస్యం అందరికీ హ్యాపీ సంక్రాంతి అంటూ చెప్పడంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది. ఈ ట్రైలర్ చూస్తే కనుక ఈ సంక్రాంతికి నాగార్జున హిట్ కొట్టడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ అభిమానులు కూడా సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు. మరి ఈ సంక్రాంతికి నాగార్జునకు నా సామిరంగా సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు