అల్లు అర్జున్ కి పోటీగా నాని?

January 30, 2024

అల్లు అర్జున్ కి పోటీగా నాని?

ద‌స‌రా, హాయ్ నాన్న..వ‌రుస స‌క్సెస్‌ల‌తో ఫుల్‌జోష్ మీదున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఆయ‌న కెరీర్‌లో 31వ సినిమాగా రూపొందుతున్న సినిమా ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికి’ తర్వాత నాని – వివేక్ కాంబినేష‌న్‌లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవ‌లే ఈ మూవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్‍రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దాదాపు 25 కోట్ల‌ రికార్డు ధ‌ర‌కు సొంతం చేసుకుంది. దసరా, హాయ్ నాన్నా వరస సూపర్ హిట్లతో ఒక్కసారిగా నాని మార్కెట్ పెరిగిపోయిందని తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 45 కోట్ల‌కు సొంతం చేసుకుంద‌ట‌. ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఎంటంటే..అల్లు అర్జున్-సుకుమార్‌ల పుష్ప‌-2 రిలీజ్ క‌నుక‌ ఆల‌స్యం అయితే ఆ సినిమా విడుద‌ల తేధి అయిన ఆగ‌స్ట్ 15నే స‌రిపోదా శ‌నివారం విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట మేక‌ర్స్‌. మ‌రి ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ప్ర‌స్తుతం స‌రిపోదా శ‌నివారం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. విలన్ గా ఎస్జే సూర్య‌కి చాలా వైవిధ్యమైన పాత్రను డిజైన్ చేశాడ‌ట వివేక్‌.. సూర్య‌- నానికి మధ్య ఉండే కాంఫ్లిక్ట్ పాయింట్ ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయలేదని తెలుస్తోంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు.

Read More: ఎన్టీఆర్ కోసమే ఎదురుచూస్తున్నాను: హృతిక్ రోషన్

ట్రెండింగ్ వార్తలు