దిల్ రాజు చాలా సార్లు కొట్టారు.. ఇప్పటికీ నా చెయ్యి పని చెయ్యదు: సుకుమార్

May 8, 2024

దిల్ రాజు చాలా సార్లు కొట్టారు.. ఇప్పటికీ నా చెయ్యి పని చెయ్యదు: సుకుమార్

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఈయన దిల్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వినాయక్ దగ్గర పని చేశారు. ఇక ఈ సినిమా సమయంలోనే దిల్ రాజు గారికి ఒక స్టోరీ లైన్ చెప్పడంతో అతనికి బాగా నచ్చగా ఈ సినిమా హిట్ అయితే తప్పకుండా మీకు డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారట. ఇలా ఇచ్చిన మాట ప్రకారమే దిల్ రాజు తన రెండో సినిమాకు సుకుమార్ గారిని డైరెక్టర్గా చేశారు.

ఇక ఈ సినిమా షూటింగ్ జరిగే ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమా విడుదల 20 సంవత్సరాలు కావడంతో తాజాగా ఆర్య సినిమా యూనిట్ మొత్తం ఒక ఈవెంట్ ప్లాన్ చేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ గారు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో రీల్స్ ఉండేవి రీల్స్ ఎక్కువైతే నిర్మాతలకు భారీ ఖర్చు వచ్చేది అయితే దిల్ రాజు గారికి ఇది రెండో సినిమా కావడంతో ఆయన వీలైనంత వరకు ఖర్చు తగ్గించే పనులే చేసేవారు.

ఇక ఆయనతో నాకు ఈ సినిమా షూటింగ్ సమయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని తెలియజేశారు. తిట్టుకోవడాలు, అరవడాలు ఒక సారీ అయితే ఏకంగా మూడు రోజుల పాటు మాట్లాడుకోలేదని సుకుమార్ తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో దిల్ రాజు గారు తనని ఎప్పుడు కొట్టేవారు ఆయన నేను నా పనులలో ఉండగా వెనుక నుంచి వచ్చి తన చేయిని వెనక్కి మడచి వీపుపై కొట్టి వెళ్లిపోయేవారు.

దిల్ రాజు గారు అలా కొట్టడం వల్ల ఇప్పటికి నేను పుషప్స్ చేయలేకపోతున్నానని ఆనొప్పి కారణము అంటూ ఈ సందర్భంగా సుకుమార్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు గారు సుకుమార్ చేయి వెనక్కి మడిచి మరి కొట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అయితే ఇదంతా సరదాగా జరిగేదని సుకుమార్ వెల్లడించారు.

Read More: నాకే పోటీకి వస్తావా.. ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్?

ట్రెండింగ్ వార్తలు