August 28, 2022
శ్రుతీహాసన్‌తో చిందులేస్తున్నారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘జై బాలయ్య’ అనే మూవీ రూపొందుతుంది. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతోంది. శ్రుతీహాసన్, బాలకృష్ణలపై ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ ఫారిన్ షెడ్యూల్‌తో ‘జై బాలయ్య’ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవుతుంది. సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.
ఇక ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాలు రెడీగా ఉన్నాయి. వైష్ణవ్‌తేజ్ చిత్రం కూడా సంక్రాంతికే రిలీజ్‌కే మొగ్గుచూపింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా కూడా నిలిస్తే బాక్సాఫీస్ వద్ద సూపర్ పోటీ ఉన్నట్లే. ఇక చిరంజీవి, బాలకృష్ణల మధ్య సంక్రాంతి వార్ అంటే అదో లెవల్లో ఉంటుంది ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌కి. చూడాలి మరి ఏం జరుగుతుందో!