టీజర్ అదరగొట్టిన ఓం భీమ్ బుష్.. మరో జాతి రత్నాలు అంటూ కామెంట్స్!

February 28, 2024

టీజర్ అదరగొట్టిన ఓం భీమ్ బుష్.. మరో జాతి రత్నాలు అంటూ కామెంట్స్!

హుషారు, రౌడీ బాయ్స్ వంటి యూత్ ఫుల్ సినిమాలు రూపొందించిన శ్రీహర్ష కొనుగంటి ఇప్పుడు తాజాగా ఓం భీమ్ బుష్ సినిమాతో మన ముందుకి రాబోతున్నాడు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబోలో రాబోతుంది ఈ సినిమా. యు వి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బులుసు కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన టీజర్ విషయానికి వస్తే ఒక నిమిషం 43 సెకండ్ల నిడివి కలిగి ఉన్న ఈ టీజర్ ని చూస్తే నిధి అన్వేషణ కోసం ఈ ముగ్గురు ఒక గ్రామానికి వ్యోమగాముల గెటప్స్ లో రావడం, ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది.

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో బ్యాంగ్ బ్రోస్ గా కనిపించబోతున్నారు. క్రిటికల్ స్టేజ్ లో ఉన్న పేషెంట్ ని పక్కన పెట్టుకొని ముగ్గురు సైంటిస్టులు తాపీగా యూట్యూబ్ లో వస్తున్న యాడ్ చూస్తున్న సీన్ తో టీజర్ మొదలవుతుంది. తరువాత ఆ ముగ్గురు సైంటిస్టులు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు.

అక్కడ గ్రామస్తుల జీవితాల్లో వెలుగునివ్వటానికి అంటూ ఏ టు జెడ్ సొల్యూషన్స్ ని ప్రారంభిస్తారు. అయితే వాళ్లు వెళ్లినది ఊరిలో ఉన్న నిధిని వెతకటానికి అన్నట్లుగా కూడా చూపిస్తారు. ఇందులో బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన స్టోరీ కూడా యాడ్ అయినట్లుగా తెలుస్తుంది. మరి వీరికి నిధి దొరికిందా? బ్లాక్ మ్యాజిక్ సంగతేమిటి అనేది సినిమా కధ అని టీజర్ని చూస్తే అనిపిస్తుంది.

ఈ సినిమా ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తోంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉంది. సన్నీ ఎమ్ ఆర్ సంగీతం కూడా చాలా డిఫరెంట్ ఫీల్ ని కలిగించింది. సామజ వర గమన సినిమాతో హిట్ అందుకున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో మళ్లీ నవ్వులు పూయించడంలో సక్సెస్ అవుతాడు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా మార్చ్ 22న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

Read More: వామ్మో అనుష్క నిజస్వరూపం అదేనా.. అసలు రంగు బయట పెట్టిన మేకప్ మెన్?

ట్రెండింగ్ వార్తలు