ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో హీరోగా ప్రియదర్శి.. దర్శక, నిర్మాతలకి ఇది హ్యాట్రిక్ ఫిల్మ్!

March 26, 2024

ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో హీరోగా ప్రియదర్శి.. దర్శక, నిర్మాతలకి ఇది హ్యాట్రిక్ ఫిల్మ్!

ప్రియదర్శి హీరోగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్టర్ గా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సినిమాని నిర్మించబోతున్నారు. ఆ సినిమా సోమవారం ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి శివలెంక కృష్ణ ప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, ఇంద్రగంటి మోహన కృష్ణ సతీమణి ఉమామహేశ్వరి స్విచ్ ఆన్ చేశారు.

కంటెంట్ బేస్డ్ కధలతో సినిమాలు ప్రొడ్యూస్ చేసే టాలీవుడ్ నిర్మాతల్లో శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఒకరు. ఆయన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణతో ఇంతకుముందు నాని హీరోగా జెంటిల్మెన్, సుధీర్ బాబు హీరోగా సన్మోహనం సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రియదర్శితో చేయబోయే సినిమా వీరిద్దరికీ హ్యాట్రిక్ సినిమా కావటం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ గా రూప కొడువాయూర్ నటిస్తుంది.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మా శ్రీదేవి మూవీస్ సంస్థకి ఆత్మీయుడు, నాకు అత్యంత సన్నిహితుడైన ప్రతిభాశాలి మోహన్ కృష్ణ ఇంద్రగంటితో జెంటిల్మెన్, సన్మోహనం చిత్రాల తర్వాత మళ్లీ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బలగం సినిమాతో కథానాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్న ప్రియదర్శికి ఇది యాప్ట్ సబ్జెక్టు. ఇదొక క్యూట్ స్వీట్ ఎంటర్టైనర్ మూవీ. ఈ సినిమాలో కుటుంబ సభ్యులు అందరూ వీక్షించే విధంగా చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చాం.

ఇప్పటి ట్రెండ్ లో జంధ్యాల గారు సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, రూప హీరో హీరోయిన్లు కాగా వీకే నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్న ఈ సినిమాకి రామజోగయ్య శాస్త్రి పాటలని రచించారు.

Read More: ఆ విషయంలో తరచూ గొడవ పడుతున్న బన్నీ, స్నేహ.. అసలేం జరుగుతుంది?

ట్రెండింగ్ వార్తలు