అతని బాధ భరించలేక అలాంటి డైలాగ్స్ చెప్పాను.. గ్లాస్ డైలాగ్ పై పవన్ క్లారిటీ!

March 20, 2024

అతని బాధ భరించలేక అలాంటి డైలాగ్స్ చెప్పాను.. గ్లాస్ డైలాగ్ పై పవన్ క్లారిటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు అంతేకాకుండా మరోవైపు ఈయన తన సినిమా పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి చిన్న వీడియోని విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ వీడియో మాత్రం ఈయన సినిమా ప్రచార కార్యక్రమాల కంటే రాజకీయ ప్రచార కార్యక్రమాలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి.

ముఖ్యంగా గ్లాస్ పగిలేకొద్దీ పదును ఎక్కువ అంటూ ఈయన చెప్పినటువంటి డైలాగ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాయని చెప్పాలి అయితే ఇలా తన సినిమాలో ఈ విధమైనటువంటి డైలాగ్స్ పెట్టడం వెనుక గల కారణాలను ఇటీవల పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈయన ఈ ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో పిఠాపురంలో ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ తన సినిమా గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇటీవల వచ్చినటువంటి ఈ వీడియోలో గాజు గ్లాస్ గురించి డైలాగ్స్ వచ్చాయి నిజానికి నాకు ఇలాంటి డైలాగ్స్ పెట్టుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని తెలిపారు. హరీష్ ఈ కథ వివరిస్తున్నప్పుడు ఈ సీన్ ఎందుకు పెట్టావు అని నేను అడిగాను అప్పుడు ఆయన మాట్లాడుతూ మీరు ఓడిపోయారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు అవి చూసి నేను తట్టుకోలేను అందుకే ఇలాంటి డైలాగ్స్ పెట్టానని తెలిపారు.

గాజు గ్లాసుకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పగిలే కొద్ది దానికి పదును ఎక్కువగా ఉంటుంది. అది ఒక సైజు మాత్రమే కాదు సైన్యం అంటూ హరీష్ తనకు చెప్పారని అయితే నాకు ఇష్టం లేకపోయినా హరీష్ బాధ చూడలేకే తాను ఇలాంటి డైలాగ్స్ చెప్పాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Read More: యాగంటి క్షేత్రంలో పుష్ప 2 షూటింగ్.. జనసంద్రంగా మారిన యాగంటి?

ట్రెండింగ్ వార్తలు