‘ఛత్రపతి’ సినిమాలో ‘ఒక్క అడుగు..’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ చాలా పాపులర్. ఇంటర్వెల్ వద్ద వచ్చే ఈ సన్నివేశం గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని పై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి.అయితే ఆ ‘ఒక్క అడుగు..’ అనే టైటిల్ తోనే ప్రభాస్ తో ఓ సినిమా కూడా రూపొందించాలని ప్లాన్ చేశారు. అలా ప్లాన్ చేసింది మరెవరో కాదు ప్రభాస్(Prabhas) పెదనాన్న కృష్ణంరాజు. ఆయనే స్వయంగా ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని అనుకున్నారు. ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థ పై ప్రభాస్ సోదరి ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఇదంతా ‘మిర్చి’ రిలీజ్ కు ముందు జరిగిన వ్యవహారం. కానీ ‘బాహుబలి’ రిలీజ్ అయ్యాక ప్రభాస్ రేంజ్ బాగా పెరిగింది.
దాంతో కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) నటించే సాహసాలు పెట్టుకోలేదు. అయితే ప్రభాస్ తో అనుకున్న ప్రాజెక్టుని ‘రాధే శ్యామ్’ గా నిర్మాతలు వంశీ, ప్రమోద్ లతో కలిసి నిర్మించింది ప్రసీద. తన తండ్రి కృష్ణంరాజుని కూడా ఈ చిత్రంలో ఓ పాత్ర చేయిస్తుంది. విక్రమాదిత్య గురువు పరమహంసగా కృష్ణంరాజు రాధే శ్యామ్ లో కనిపించబోతున్నారు. గతంలో ప్రభాస్, కృష్ణంరాజు కాంబినేషన్లో ‘బిల్లా’ ‘రెబల్’ చిత్రాలు వచ్చాయి. వీటిలో ‘బిల్లా’ యావరేజ్ కాగా, ‘రెబల్’ ప్లాప్ అయ్యింది. మరి ఈ ‘రాధే శ్యామ్’ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.