March 29, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించినటువంటి RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరో గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన తదుపరి సినిమాని శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడుతుంది.
ఇలా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాలను కూడా ఇదివరకే ప్రకటించారు. తన 16వ చిత్రంగా బుచ్చిబాబు దర్శకత్వంలో చేయగా 17వ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను విడుదల చేశారు. అయితే ఈ పాట కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులు ఈ పాట విషయంలో కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.
అనుకున్న స్థాయిలో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాట కోసం శంకర్ ఖర్చు చేస్తున్నటువంటి డబ్బు గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ పాటకు మాత్రమే శంకర్ ఏకంగా 18 కోట్లు ఖర్చు చేశారనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు చేసిన లాభం ఏముందయ్యా శంకర్ అంటూ ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Read More: డార్లింగ్ పార్టీ కావాలంటున్న రష్మిక.. విజయ్ సమాధానం ఏంటో తెలుసా?