DeviSriPrasad: దేవీతో ర‌హ‌స్య‌ వివాహంపై స్పందించిన న‌టి

September 5, 2022

DeviSriPrasad: దేవీతో ర‌హ‌స్య‌ వివాహంపై స్పందించిన న‌టి

రాక్‌స్టార్ దేవిశ్రీ‌ ప్రసాద్‌తో (Devi Sri Prasad) తన వివాహం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై నటి పూజిత పొన్నాడ (Pujita Ponnada) స్పందించారు. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని చెప్పుకొచ్చారు. తన తదుపరి చిత్రం ‘ఆకాశ వీధుల్లో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘దేవిశ్రీతో నేను రిలేషన్‌లో ఉన్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవం. అసలు ఆ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నామని అంటున్నారు. అది నిజం కాదు. ఆయనతోనే కాదు నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను. ప్రస్తుతానికి నేను సింగిల్‌’’ అని ఆమె తెలిపారు. సోషల్‌మీడియాలో కొన్నిసార్లు తనపై నెగెటివ్‌ కామెంట్స్‌ వస్తుంటాయని.. వాటిని చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని ఆమె అన్నారు.

ఇక, విశాఖకు చెందిన పూజిత ‘ఊపిరి’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆమె చిన్న పాత్ర పోషించారు. ‘రంగస్థలం’, ‘బ్రాండ్‌ బాబు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘మిస్‌ ఇండియా’, ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ వంటి చిత్రాల్లో ఆమె నటించినప్పటికీ అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేకపోయారు

ట్రెండింగ్ వార్తలు