రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన అల్లు అర్జున్.. ఒక్క మూవీకి ఏకంగా అన్ని కోట్లా?

April 30, 2024

రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన అల్లు అర్జున్.. ఒక్క మూవీకి ఏకంగా అన్ని కోట్లా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 మూవీలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 కు టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

ఈ టీజర్ ని చూసిన ఫాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టీజర్ లో జాతర లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఇకపోతే పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా మారడంతో అల్లు అర్జున్ ప్రస్తుతం అందుకు తగ్గట్టుగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కూడా తన రెమ్యునరేషన్‌ను పెంచారట. పుష్ఫ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో ఒక్కో సినిమాకు 150 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారట.

ద మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న పుష్ప 2 నుంచే ఆ రెమ్యునరేషన్ తీసుకోనున్నారట అల్లు అర్జున్. అయితే అంతకు ముందు 100కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకునే వారు మన ఐకాన్ స్టార్. ప్రస్తుతం ఇదే వార్త వైరల్ అవ్వడంతో ఏంటి ఒక్క సినిమాకి ఏకంగా 50 కోట్లు పెంచారా అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త విన్న అభిమానులు షాక్ అవుతున్నారు.. ఇది కదా అల్లు అర్జున్ క్రేజ్ అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Read More: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన నటి కోవై సరళ.. నెట్టింట ఫోటోస్ వైరల్?

ట్రెండింగ్ వార్తలు