September 5, 2022
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth),యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) తమ కెరీర్ ప్రారంభరోజుల్లో `16 వయతినిలే’, ‘థిల్లు ముల్లు’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. తర్వాత ఇద్దరు వారి వారి సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపించనున్నారు. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్-1’ (Ponniyin Selvan) ఆడియో, ట్రైలర్ విడుదల వేడుకకు రజనీ, కమల్ ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నారు. ఈ నెల 6న ఆ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ హర్షం వ్యక్తం చేసింది. ‘ఈ ఇద్దరు కలిసి రావడానికి మించింది మరొకటి లేదు’ అని పేర్కొంది..
విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్, విక్రమ్ ప్రభు తదితరులు ప్రధాన తారాగణంగా చోళ రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న గ్రాండ్గా రిలీజ్ కానుంది. మొదటిభాగం వర్కౌట్ అయితే సినిమాకి సీక్వెల్ కూడా రానుంది.
It can’t get any bigger or better than this! Honoured to have Ulaganayagan @ikamalhaasan & Superstar @rajinikanth with us at our music and trailer launch function!#PS1 #PonniyinSelvan #CholasAreComing
— Lyca Productions (@LycaProductions) September 4, 2022
In theatres on 30th September in Tamil, Hindi, Telugu, Malayalam and Kannada pic.twitter.com/igssLZbaT7