April 22, 2024
తలైవా రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి విజయం కావడంతో తదుపరి ఈయన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా రజినీకాంత్ 171వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇటీవల లోకేష్ కనగరాజ్ విక్రమ్, లియో వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ తరుణంలోనే రజినీకాంత్ లోకేష్ సినిమా అంటే అభిమానులలో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో పలువురు సెలబ్రిటీలు కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే రజనీకాంత్ కుమార్తె పాత్రలో శృతిహాసన్ ఈ సినిమాలో ఎంపికైన విషయం మనకు తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున కూడా భాగం కాబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఇటీవల డైరెక్టర్ లోకేష్ నాగార్జునతో భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా నాగార్జునతో లోకేష్ బేటి కావడంతో బహుశా రజనీకాంత్ సినిమా కోసమే ఆయనని సంప్రదించారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నటించడానికి నాగార్జున కూడా చాలా ఆసక్తిగా ఉన్నారని త్వరలోనే నాగార్జున పాత్రకు సంబంధించిన ఈ విషయాలన్నింటినీ కూడా అధికారకంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించినటువంటి సినిమాలో నటిస్తున్నారు.
Read More: కల్కి నుంచి అదిరిపోయే అప్డేట్.. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్.. వీడియో వైరల్?