లోకేష్ కనగరాజ్ సినిమాలో కూలిగా రజినీకాంత్.. టైటిల్ టీజర్ అదిరిపోయిందిగా?

April 23, 2024

లోకేష్ కనగరాజ్ సినిమాలో కూలిగా రజినీకాంత్.. టైటిల్ టీజర్ అదిరిపోయిందిగా?

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. చాలా కాలం తర్వాత జైలర్ తో మంచిది సూపర్ హిట్ ను అందుకున్నారు రజినీకాంత్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా తర్వాత ఇటీవలే లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ తన 171వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ నుంచి రజిని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ టీజర్ ని విడుదల చేశారు. ఈ సినిమాకు కూలి అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో గోల్డ్ మాఫియాని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

మూడు నిముషాలు పాటు ఉన్న ఈ టీజర్ ని యాక్షన్ కట్ తో రెడీ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి సినిమా పై భారీ అంచనాలనే క్రియేట్ చేసారు. ఇక ఈ టీజర్ తో మరి విషయం కూడా అర్ధమయ్యిపొయింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ఈ మూవీకి ఏ సంబంధం లేదని. ఈ చిత్రాన్ని స్టాండ్ ఎలోన్ మూవీగానే తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో రజినీకాంత్ కెరిర్ లో మరో సూపర్ హిట్ సినిమా ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు..

Read More: ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు

ట్రెండింగ్ వార్తలు