గోవా అందాలతో రకుల్ వెడ్డింగ్ కార్డ్.. వైరల్ అవుతున్న ఫోటో!

February 12, 2024

గోవా అందాలతో రకుల్ వెడ్డింగ్ కార్డ్.. వైరల్ అవుతున్న ఫోటో!

సినీ ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ప్రేమలో విహరిస్తూ ప్రేమ పక్షులలా తిరిగినటువంటి నటి రకుల్ ప్రీతి సింగ్ నటుడు జాకీ భగ్నాని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో విహరిస్తూ ఉన్నారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని దాచకుండా రకుల్ సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు.

ఇలా ప్రేమ పక్షులలా జంటగా కలిసి వెళ్తూ వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. అయితే తాజాగా ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనీ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రకుల్ కూడా తన పెళ్లి పనులలో ఎంతో బిజీగా గడిపారు. ఇక వీరిద్దరూ మాల్దీవ్స్ లో తమ పెళ్లి చేసుకోవాలని భావించారు కానీ మాల్దీవ్స్ పై మోడీ విధించిన ఆంక్షలతో వీరి పెళ్లి వేదికను గోవాకి మార్చారు.

ఇలా వీరిద్దరూ గోవాలో తమ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే గోవాలో వీరు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ జాకీ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి వెడ్డింగ్ కార్డు చాలా విభిన్నంగా డిజైన్ చేయించారు. వీరి వివాహం గోవాలో జరగబోతున్నటువంటి తరుణంలో గోవా అందాలతోనే ఈ పెళ్లి పత్రికను రూపొందించారు.

గోవా అంటేనే మనకు బీచ్ కొబ్బరి చెట్లు అన్ని కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. అదే విధంగా ఈమె వెడ్డింగ్ కార్డు కూడా కొబ్బరి చెట్లు బీచ్ అందాలన్నింటిని పొందుపరిచి ఈ కార్డు రూపొందించారు. ఇక వీరి వివాహం ఫిబ్రవరి 21వ తేదీ జరగబోతుందని వెల్లడించారు. ఇక మూడో రోజుల పాటు జరగబోయే ఈ పెళ్లి వేడుకలలో ముగ్గురు స్పెషల్ డిజైనర్స్ డిజైన్ చేయించిన దుస్తులను ధరించబోతున్నారట. సబ్యసాచి, తరుణ్ తహిల్యాని, మనీష్ మల్హోత్రా ఇలా ముగ్గురు డిజైనర్లు రెడీ చేసిన వస్త్రాలని రకుల్, భగ్నానీ  ధరించబోతున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా రకుల్ సినిమాలలో నటించబోతున్నారని విషయం అందరికీ తెలిసిందే.

Read More: బొక్కలో బిగ్ బాస్ అంటూ రెచ్చిపోయిన నోయల్?

ట్రెండింగ్ వార్తలు