కొత్త పార్లమెంట్‌లో రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీలు.. నెట్టింట ఫోటోస్ వైరల్!

April 24, 2024

కొత్త పార్లమెంట్‌లో రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీలు.. నెట్టింట ఫోటోస్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రకుల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపింది రకుల్. ఇకపోతే ఇటీవలె ఈమె తన ప్రియుడు జాకీ భగ్నానిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో మునికి తేలుతున్న ఈ జంట ఇటీవల ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.

ప్రస్తుతం ఈ జంట వైవాహిక జీవితాన్ని గడుపుతూ వేకెషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తరచూ తనకు తన భర్తకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన సోషల్ మీడియా ఖాతాలో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది.

రకుల్, జాకీ భగ్నానీ ప్రస్తుతం కొత్త పార్లమెంట్ భవనం వద్ద నిలబడి ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఈ కొత్త జంట పార్లమెంట్ భవనంలో పెట్టిన పోజులిప్పుడు వైరల్ అవుతున్నాయి. సత్యమేవ జయతే అంటూ రకుల్ వదిలిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు క్యూట్ కపుల్ నైస్ జోడి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read More: మీరు వింటున్న రూమర్స్ అని నిజమే.. నెట్టింట వైరల్ అవుతున్న ప్రశాంత వర్మ కామెంట్!

ట్రెండింగ్ వార్తలు