నా తొలి సంపాదన 5 వేలే… వారి వల్లే ఈ స్థాయికి వచ్చాను: రకుల్

February 20, 2024

నా తొలి సంపాదన 5 వేలే… వారి వల్లే ఈ స్థాయికి వచ్చాను: రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ భాషతో సంబంధం లేకుండా అన్ని భాష చిత్రాలలో నటిస్తూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి రకుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే తన పెళ్లి కోసం తన కుటుంబ సభ్యులతో రకుల్ గోవా చేరుకున్నారు. ఈమె పెళ్లి వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా మొదలయ్యాయి.

బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నటువంటి రకుల్ ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విధంగా ఈయన పెళ్లి ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రకుల్ తన మొదటి సంపాదన గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను కెరియర్ మొదట్లో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని తెలిపారు. ఇలా మోడల్ గా మొదలైనటువంటి తన ప్రయాణం హీరోయిన్ వరకు కొనసాగుతూ వచ్చిందని తెలిపారు.

మోడల్ గా ప్రారంభమైనటువంటి నా ప్రయాణంలో నేను మొదటి అందుకున్నటువంటి రెమ్యూనరేషన్ 5000 రూపాయలని ఆ రెమ్యూనరేషన్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమని రకుల్ తెలిపారు. ఇలా 5000 నుంచి మొదలైనటువంటి నా సంపాదన ఇక్కడి వరకు వచ్చింది. నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం నా తల్లితండ్రులేనని రకుల్ తెలిపారు. నా తల్లిదండ్రులతోపాటు నా స్నేహితులు నాకు మద్దతు తెలియజేయడంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నానని రకుల్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం రకుల్ సినిమాల విషయానికొస్తే ఈమె మేరీ పత్నీ కా రీమేక్‌, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాలలో కొనసాగుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ తన పెళ్లి వేడుకలలో బిజీగా గడుపుతున్నారు.

Read More: స్వీయ దర్శకత్వంలో ధనుష్ 50వ సినిమా.. రాయన్ టైటిల్ ఫిక్స్!

ట్రెండింగ్ వార్తలు