April 6, 2024
సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి సక్సెస్ అయినటువంటి రకుల్ ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారు. ఇలా సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల నిర్మాత నటుడు అయినటువంటి తన ప్రియుడు జాకీ భగ్నానితో గోవాలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇలా కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఫిబ్రవరి 21వ తేదీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక పెళ్లి తర్వాత కూడా రకుల్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఇవే శుభవార్తను తెలియజేస్తున్నాను అంటూ ఓ గుడ్ న్యూస్ చెప్పారు అయితే అందరూ కూడా పెళ్లి అయిన వెంటనే గుడ్ న్యూస్ అంటున్నారు అంటే రకుల్ తల్లి కాబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈమె చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే విషయానికి వస్తే రకుల్ పెళ్లయిన తర్వాత మొదటిసారి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈమె ఇది వరకే పలు వ్యాపారాలలో ప్రారంభించారు కానీ పెళ్లి తర్వాత సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారట. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.
టేస్టీ అండ్ హెల్దీ అంటూ ఈమె ఈ వీడియోని విడుదల చేయడమే కాకుండా అసలు విషయం ఉగాది పండుగ రోజు అందరితో చెబుతానని తెలియజేశారు. ఇలా టేస్టీ హెల్ది అంటున్నారు అంటే ఈమె బహుశా ఆరోగ్య రహస్యాలను అందరికీ చెబుతారా లేకుంటే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చిట్కాలను కనుక చెబుతారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
ఇక మరికొందరైతే కొంపదీసి ఈమె కూడా ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారా అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మెగా కోడలు ఉపాసన అత్తమ్మ కిచెన్స్ అంటూ ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే రకుల్ సైతం అలాంటి బిజినెస్ ప్రారంభించబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి మరి ఏం చేయబోతున్నారు అనే విషయాలు తెలియాలి అంటే ఉగాది పండుగ వరకు ఎదురు చూడాల్సిందే.
Read More: నిర్మాతలకు షాక్ ఇస్తున్న సాయి పల్లవి… రెండింతలు పెంచిన రెమ్యూనరేషన్!