రామ్‌ ఆపరేషన్‌ స్టార్ట్‌…ఆస‌క్తిక‌రంగా వారియ‌ర్ ట్రైల‌ర్‌

July 2, 2022

రామ్‌ ఆపరేషన్‌ స్టార్ట్‌…ఆస‌క్తిక‌రంగా వారియ‌ర్ ట్రైల‌ర్‌

Ram Pothineni Warrior Trailer: ఇస్మార్ట్‌ శంకర్‌ హిట్‌ తర్వాత హీరో రామ్‌ ఫుల్‌గా యాక్షన్‌ సినిమాలనే ప్రిఫర్‌ చేస్తున్నాడు. ఇస్మార్ట్‌శంకర్‌ తర్వాత రామ్‌ చేసిన ‘రెడ్‌’ కూడా యాక్షన్‌ ఫిల్మే. ఇప్పుడు రామ్‌ లేటెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ది వారియర్‌’. ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది. లింగు సామీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కృతీశెట్టి హీరోయిన్‌గా కాగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్స్‌ విడుదలైయ్యాయి.

తెలుగు ట్రైలర్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను, తమిళం ట్రైలర్‌ను శివకార్తికేయన్‌ రిలీజ్‌ చేశారు. కథ కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో డిప్యూటీ సూపరింటెండ్‌ పోలీసాఫీసర్‌ సత్య పాత్రలో రామ్, రౌడీషీటర్‌ విలన్‌ పాత్రలో ఆది, ఆర్జే మహాలక్ష్మీ పాత్రలో కృతీశెట్టి నటించారు. కాగా ‘ది వారియర్‌’ సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించినట్లుగా ట్రైలర్‌లో చూపించారు. ఇక చివర్లో రామ్‌ని డాక్ట‌ర్‌గా చూపించి ట్విస్ట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు లింగుసామి. రెడ్ మాదిరిగానే ఈ సినిమాలో కూడా రామ్ డ‌బుల్ యాక్ష‌న్ చేయ‌బోతున్నాడా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.. ఇప్ప‌టికే దేవి శ్రీ స‌మ‌కూర్చిన బుల్లెట్ సాంగ్‌, విజిల్ సాంగ్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. టీజర్‌లో త‌మిళ వాస‌న గుప్పుమ‌న్నా ట్రైల‌ర్‌లో అది క‌న‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు చిత్ర యూనిట్‌. మొత్తానికి వారియ‌ర్ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింద‌నే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత రామ్, బోయపాటి కాంబినేషన్‌లోని సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి: ఆగస్టులో చిరంజీవి విదేశీ ప్రయాణం Ram Pothineni Warrior Trailer: 

ట్రెండింగ్ వార్తలు