రవితేజ రామారావు ఆన్ డ్యూటీ వ‌చ్చేది ఎప్పుడంటే?

June 23, 2022

రవితేజ రామారావు ఆన్ డ్యూటీ వ‌చ్చేది ఎప్పుడంటే?

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదీలావుండగా చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా వ‌దిలిన‌ రిలీజ్ డేట్ పోస్టర్ లో ర‌వితేజ తీక్షణంగా ఆలోచిస్తూ సీరియస్ గా దేన్నో చూస్తున్నారు. ఈ ఇంటెన్స్ లుక్ ఆసక్తికరంగా వుంది.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Read More: వార‌సుడుగా ద‌ళ‌ప‌తి విజ‌య్..ఆ సినిమాకు రీమేకా?

ట్రెండింగ్ వార్తలు