పత్తి రైతుగా కనిపించబోతున్న రవితేజ.. బ్లాక్ బస్టర్ ఖాయమేనా?

February 5, 2024

పత్తి రైతుగా కనిపించబోతున్న రవితేజ.. బ్లాక్ బస్టర్ ఖాయమేనా?

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన ఈగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ విడుదల కావాల్సి ఉండగా అప్పటికే ఎక్కువ సినిమాలు పోటీ ఉండడంతో పోటీ తగ్గించడానికి వాయిదా వేసుకున్నారు.

ఇక ఫిబ్రవరి 9వ తేదీ విడుదల కాబోయే సినిమాలలో ఈ సినిమా పైన భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్రబృందం ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో భాగంగా నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అసలు నిరాశపరచదంటూ ఈయన హామీ ఇచ్చారు.

ఈ సినిమా రవితేజ సినీ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో రవితేజ పోషించిన ఈగల్ పాత్ర పత్తి రైతుల సమస్యల మీద పోరాడే విధంగా డిజైన్ చేశారట. అలా అని ఏదో సందేశాలు, విప్లవాలు లాంటివి లేకుండా అంతర్లీనంగా మెసేజ్ ఇస్తూనే మాస్ జనాలు ఊగిపోయే లాగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో రవితేజ కూడా స్వయంగా పత్తి పండించే రైతు పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇలా పత్తి రైతులకు మద్దతుగా రవితేజ కూడా ఒక రైతు పాత్రలో కనిపించబోతున్నారనే విషయం తెలియడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ధమాకా సినిమా తర్వాత ఈయన పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఏ సినిమా కూడా పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో మాత్రం మాస్ మహారాజా మరో హిట్ అందుకోబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూడాలి ఈ సినిమా ఈయనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో.

Read More: ప్రభాస్ కల్కి కోసం 3 క్లైమాక్స్ సన్నివేశాలు?

ట్రెండింగ్ వార్తలు