దర్శకులకు షాక్‌ ఇస్తున్న రానా

July 21, 2023

దర్శకులకు షాక్‌ ఇస్తున్న రానా

అవును..నటుడు- నిర్మాత రానా దర్శకులకు షాక్‌ల మీద షాకులు ఇస్తున్నాడు. ఎలా అంటారా…కమిటైన సినిమాలను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లకుండానే మరో దర్శకుడితో మరో కొత్త సినిమాకు కమిట్‌ అవుతున్నాడు. ‘అరణ్య’, ‘1945’, ‘విరాటపర్వం’…ఇలా వరుస ప్లాఫ్‌ సినిమాలు రానాను వెంటాడాయి.  ఆ సమ యంలో తమిళంలో ‘గృహం’,  ‘నెట్రికన్‌’ వంటి హిట్‌ ఫిల్మ్‌ను తీసిన దర్శకుడు మిలింద్‌రావుతో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు రానా.  విశ్వశాంతి పిక్చర్స్‌ ఈ సినిమానను నిర్మించాల్సింది.  కారణాలు ఏమైనా 2022లోనే సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ సినిమా ఎమైందో తెలియదు. ఆగిపోయిందనే టాక్‌ వినిపిస్తోంది.

సోలో హీరోగా రానా స్ట్రగుల్‌ అవుతున్న సమయంలో అతనికి ‘నేనేరాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్‌ ఇచ్చారు దర్శకుడు తేజ. ఆ తర్వాత రానా –  తేజ కాంబినేషన్‌లో ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే సినిమాను రావాల్సింది. రానా తమ్ముడు అభిరామ్‌ హీరోగా నటించిన తొలి సినిమా ‘అహింస’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చిరా లలో జరిగినప్పుడు దర్శకుడు తేజనే ఈ సినిమాను కన్ఫార్మ్‌ చేశాడు. కానీ ‘అహింస’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. తేజ వరుస ప్లాప్‌ల ట్రాక్‌ కొనసాగింది. దీంతో తేజతో తన మూవీని రానా ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇక రానా తర్వాతి సినిమా ‘హిరణ్యకశ్యప’ అని ప్రకటించారు. నిజానికి ఈ సినిమాపై ఫస్ట్‌ నుంచి వర్క్‌చేస్తోంది దర్శకుడు గుణశేఖర్‌. కానీ ఈ సినిమాకు కథను దర్శ కుడు త్రివిక్రమ్‌ అందిస్తారని రానా ప్రకటించారు. దీంతో రానా- గుణశేఖర్‌ల మధ్య అభిప్రాయాభేదాలు వచ్చాయనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఇలా దర్శకుడు గుణ శేఖర్‌కు కూడా షాక్‌ ఇచ్చారు రానా. అయితే గతంలో పవన్‌ కల్యాణ్‌, రానాలు కలిసి నటించిన ‘భీమ్లానాయక్‌’కు త్రివిక్రమ్‌ కథ, స్క్రీన్‌ ప్లే అందించారు. ఈ సమయం లోనే రానా-త్రివిక్రమ్‌ మరింత క్లోజ్‌ అయ్యారనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు..గతంలో భారతమల్లయోధుడు కోడిరామ్మూర్తి బయోపిక్‌లో రానా నటిస్తారనే ప్రకటన వచ్చింది. కానీ ఈ సినిమా కూడా అటకెక్కినట్లుగా తెలుస్తోంది. ఇలా గత మూడేళ్లలో తనతో కమిటైన దర్శకులకు రానా గట్టి షాకే ఇచ్చారు.

Read More: ప్రాజెక్ట్‌ కె….కల్కి2898

ట్రెండింగ్ వార్తలు