August 30, 2022
విరాటపర్వం సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు హీరో రానా. ఆ సినిమా తర్వాత బయట కనిపించడం చాలా తక్కువ చేశారు. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా హీరో రానా, తన వైఫ్ తో చాలా రోజుల తర్వాత బయట కనిపించాడు. అది కూడా ఓ పెళ్లి కావడంతో కలర్ ఫుల్ గా ఉన్నారు. ఈ విషయాన్ని తన భార్య మిహిక తన ఇన్ స్టా ద్వారా వెల్లడించాడు.
ముంబయిలోని తమ కజిన్ పెళ్లిలో సందడి చేశారీ జంట. ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ అయిన కృనాల్ రావల్, అప్రిత మెహతాల పెళ్లివేడుకలో ఈ జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఇక రానా భార్య మిహిక.. ధరించిన గోల్డ్ ఎంబ్రాయిడరీతో మెరిసిపోయే లెహంగా ధర తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ లెహంగా కాస్ట్ రూ.3 లక్షల రూపాయలకు పైనే అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ కావడంతో.. రానా-మిహికతో పాటు ఆమె వేసుకున్న డ్రస్ గురించి మాట్లాడుకుంటున్నారు.
https://www.instagram.com/p/Ch15nhSvkKo/?utm_source=ig_web_copy_link