రావాణాసుర వాయిదా పడ్డట్లే!

August 29, 2022

రావాణాసుర వాయిదా పడ్డట్లే!

రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ హీరోగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రావాణాసుర’. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్, పూజితా పొన్నాడ హీరోయిన్స్‌గా నటి స్తున్నారు. ఈ సినిమాలో హీరో సుశాంత్‌ కీ రోల్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఐదుకోట్ల రూపాయాల ఖర్చుతో వేసిన సెట్‌లో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌ షూటింగ్‌ జరుగుతోంది.

యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ స్టంట్‌ శివ ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేశారు. అయితే ఈ సినిమాను తొలుత సెప్టెంబరు 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్‌ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇదే రోజున తమిళంలో రూపొందిన భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రిలీజ్‌ అవుతుంది. మరోవైపు రవితేజ ప్రజెంట్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘ధమాకా’ చిత్రాలను కూడా చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో గెస్ట్‌ రోల్‌ చేయనున్నారు రవితేజ. ఈ చిత్రాలతో పాటు వక్కంతం వంశీ, కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వాల్లో సినిమాలు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు రవితేజ.

ట్రెండింగ్ వార్తలు