ఘనంగా RC 16 పూజ కార్యక్రమాలు.. స్పెషల్ అట్రాక్షన్ గా ఉపాసన?

March 20, 2024

ఘనంగా RC 16 పూజ కార్యక్రమాలు.. స్పెషల్ అట్రాక్షన్ గా ఉపాసన?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా దాదాపు చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది .ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయబోతున్న నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

నేడు హైదరాబాద్ లో ఎంతో ఘనంగా అతిరథ మహారథుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక సెట్ ఏర్పాటు చేసి ఈ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది స్టార్ సినీ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు ఈమె తండ్రి బోని కపూర్ కూడా హాజరయ్యారు. ఇక రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కూడా ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయి క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాక్షాత్తు సుకుమార్ శిష్యులు కావడంతో ఈ పూజా కార్యక్రమాలలో సుకుమార్ కూడా పాల్గొన్నారు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నటువంటి నేపథ్యంలో శంకర్ సైతం ఈ వేడుకలలో సందడి చేశారు. ఇక ఈ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ఈ పూజ కార్యక్రమాలలో ఏఆర్ రెహమాన్ కూడా సందడి చేశారు.

Read More: ఏడు విభిన్న పాత్రలలో సందడి చేయనున్న మంచు లక్ష్మి?

ట్రెండింగ్ వార్తలు