నాకే పోటీకి వస్తావా.. ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్?

May 8, 2024

నాకే పోటీకి వస్తావా.. ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రామ్ చరణ్ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి రామ్ చరణ్ అనంతరం తన నటనతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉండే చరణ్ వివాదాలకు కాస్త దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ కి సంబంధించి ఒక వార్త తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కేవలం తన సినిమాకు పోటీగా మరో సినిమా రాబోతుందని తెలిసి రామ్ చరణ్ ఏకంగా ఆ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చారంటూ ఈ వార్త సంచలనంగా మారింది. మరి ఏ డైరెక్టర్ కి రామ్ చరణ్ వార్నింగ్ ఇచ్చారు అసలేం జరిగిందనే విషయానికి వస్తే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకులలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఈయన చేసే సినిమాలు అన్ని కూడా ఇప్పటివరకు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈయన దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్2 సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు పోటీగా బాలయ్య హీరోగా నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా వచ్చింది. అలాగే రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఓసారి అనిల్ రావిపూడి రామ్ చరణ్ ని కలవగా రాంచరణ్ ఏంటి నా సినిమాకి పోటీగా సినిమా విడుదల చేస్తున్నావు అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఆ షాక్ లో నుంచి అనిల్ బయటపడే లోపు చరణ్ ఒక్కసారిగా హగ్ చేసుకుని జస్ట్ జోక్ చేశాను అంతే నీ సినిమా చాలా మంచిగా ఆడాలి అంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేసారని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఓ సందర్భంలో స్వయంగా ఈ విషయాన్ని తెలియచేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది.

Read More: ఆర్య సినిమాని ఇంతమంది హీరోలు రిజెక్ట్ చేశారా… ఆ హీరోని ఉద్దేశించి కథ రాశారా?

ట్రెండింగ్ వార్తలు