హీరోయిన్లు గ్లామర్ షో చేసేది అందుకేనా.. ముఖం మీద అడిగిన రీతు చౌదరి?

March 8, 2024

హీరోయిన్లు గ్లామర్ షో చేసేది అందుకేనా.. ముఖం మీద అడిగిన రీతు చౌదరి?

రీతు చౌదరి పరిచయం అవసరం లేని పేరు. ఈమె బుల్లితెర సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం యూట్యూబ్ వీడియోలు, పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతో మెప్పించారు. ఇక రీతు చౌదరి జబర్దస్త్ కార్యక్రమంలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉన్నటువంటి రీతూ ప్రస్తుతం దావత్ అనే కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరవుతూ సందడి చేస్తుంటారు. అయితే తాజాగా నటి అనన్య నాగళ్ళ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈమె నటించిన తంత్ర సినిమా మార్చి 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో భాగంగా రీతూ అనన్యను ప్రశ్నిస్తూ మీరు అందంగా కనిపించడం కోసం సర్జరీ చేయించుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ అవును తాను పెదాలకు సర్జరీ చేయించుకున్నానని తెలిపారు. ఇకపోతే హీరోయిన్లు పెద్ద ఎత్తున పొట్టి పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

ఇలాంటి ఫోటోలను షేర్ చేసేది కేవలం సినిమా అవకాశాలు కోసమేనా ఈ ఫోటోల ద్వారా మేము గ్లామర్ షో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే ఇలాంటి పోస్టులు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ చాలామంది అలాగే చేస్తున్నారంటూ ఈమె చెప్పారు అయితే ఈ ప్రశ్నకు ఈమె ఇంకా ఎలాంటి సమాధానాలు చెప్పారా అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి.

Read More: ఆ హీరోతో నాది అలాంటి అనుబంధం సమంత కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు