ఆ హీరోతో నాది అలాంటి అనుబంధం సమంత కామెంట్స్ వైరల్!

March 8, 2024

ఆ హీరోతో నాది అలాంటి అనుబంధం సమంత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సమంత ఒకరు ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైనటువంటి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి అందరి హీరోలతో కలిసి నటించారు.

ఇక ఈమె ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల ఓ సందర్భంలో ఈ ముగ్గురు హీరోలకు మీరు ఇచ్చే టాగ్స్ ఏంటి అనే ప్రశ్న సమంతకు ఎదురయింది. ఈ ప్రశ్నకు సమంత ఆసక్తికరమైనటువంటి సమాధానాలు చెప్పారు ముందుగా ఎన్టీఆర్ గురించి ఈమె మాట్లాడుతూ గ్రేట్ డాన్సర్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ సమంత కాంబినేషన్లో మొదట బృందావనం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా తర్వాత రామయ్య వస్తావయ్య జనతా గ్యారేజ్ వంటి సినిమాలలో కలిసిన నటించారు. ఇక మహేష్ బాబుకి ఎలాంటి ట్యాగ్ ఇస్తారు అనే విషయం గురించి ఈమె మాట్లాడుతూ మోస్ట్ డిజైరబుల్ అనే టాగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక ఈమె మహేష్ బాబుతో కలిసి దూకుడు సినిమాలో నటించారు. అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ సమంత కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది ఇక పవన్ కళ్యాణ్ కి ట్యాగ్ ఇస్తూ మై గురు అండ్ కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ తో తనది గురు శిష్యుల అనుబంధం అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన త్వరలోనే రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

Read More: గోపీచంద్ భీమా రివ్యూ అండ్ రేటింగ్!

ట్రెండింగ్ వార్తలు