సలార్ 2 వచ్చేది అప్పుడేనా… అసలు విషయం చెప్పిన నిర్మాత?

January 4, 2024

సలార్ 2 వచ్చేది అప్పుడేనా… అసలు విషయం చెప్పిన నిర్మాత?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 22వ తేదీ విడుదల అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా కూడా ఈ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక సలార్ సినిమా మంచి సక్సెస్ కావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో భాగంగా అందరి పాత్రలను దర్శకుడు పరిచయం చేశారు. అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రం మరో రేంజ్ లో ఉండబోతుందని ఈ సినిమా క్లైమాక్స్ చూస్తేనే అర్థమవుతుంది. సలార్ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా సీక్వెల్ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ఈ సీక్వెల్ ఎప్పుడు రాబోతుందనే విషయం గురించి అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా సినిమా నిర్మాత విజయ్ కిరంగదూర్ ఈ సినిమా విడుదల విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నిర్మాత విజయ్ మాట్లాడుతూ సలార్ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిందని తెలిపారు. ఏ క్షణమైనా కూడా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రశాంత్ ప్రభాస్ ఇద్దరూ కూడా ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేయాలని ఆలోచనలు ఉన్నారని నిర్మాత వెల్లడించారు. 15 నెలల కాలంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు ప్రశాంత్ భావించారని నిర్మాత విజయ్ వెల్లడించారు.

ఇక ఈ సినిమాని 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము అంటూ సలార్ 2 విడుదల గురించి నిర్మాత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సలార్ సినిమా కలెక్షన్ల విషయంలో మేము పూర్తిగా సంతృప్తిగా ఉన్నామని ఈయన తెలియజేశారు. సలార్ పార్ట్ వన్ అనేది పార్ట్ టూ కు ట్రైలర్ లాంటిదని తెలిపారు. ఈ పార్ట్ ద్వారా డైరెక్టర్ అందరి పాత్రలను పరిచయం చేశారు కానీ రెండవ పార్ట్ లో చాలా ట్విస్టులు ఉన్నాయని ఈ సినిమా మరో లెవల్లో ఉంటుంది అంటూ ఈ సందర్భంగా సినిమాపై అంచనాలను పెంచుతూ నిర్మాత విజయ్ కిరంగదూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఆకలి తీర్చే సినిమా.. ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన నిర్మాత నాగ వంశీ!

ట్రెండింగ్ వార్తలు